హాలీవుడ్ లో తెరకెక్కనున్న వరల్డ్ వార్ జెడ్ టూ సినిమా
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ నటించిన సంచలన జోంబీ థ్రిల్లర్ వరల్డ్ వార్ జెడ్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఎడ్వర్డ్ బెర్గర్ దర్శకత్వం వహించనుండగా, బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. పారామౌంట్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాధాన్యత కలిగిన చిత్రంగా గుర్తించడంతో గత దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ఈ సీక్వెల్‌కు మళ్లీ మోక్షం లభించింది.