రైతు కుటుంబం నుంచి సివిల్ జడ్జిగా ఎంపికైన కిరణ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ప్యాపిలి
ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు టి. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ నెల 26వ తేదీన అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన సివిల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.