ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు: పదహారు లక్షల మంది భక్తుల దర్శనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. యాగశాలలో రుత్వికులు నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలు సమాప్తమైనట్లు అధికారులు తెలిపారు. శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని పదకొండు రోజుల్లో పదహారు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. చివరి రోజున కృష్ణానదిలో స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. భవానీ దీక్షాధారుల రద్దీ మరో మూడు రోజులపాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.