దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలపై ప్రత్యేక అవగాహన ప్రచారం

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కార్మిక చట్టాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, యజమానులు, కార్మికుల మధ్య నిరంతరం చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్యాలు అందించాలని ఆయన సూచించారు.