బెల్లంపల్లిలో భారీగా టీబీజికేఎస్ గూటికి చేరిన పలువురు కార్మిక నాయకులు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి సీహెచ్పీ వద్ద మర్రి సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో పలువురు కార్మిక నాయకులు టీబీజికేఎస్ యూనియన్లో చేరారు. దుండ్ర రవికుమార్, ఎర్రగొల్ల ఓదెలు, పిట్టల సదయ్య, శారదా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నూతన నాయకులకు యూనియన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.