వంశధార నదిలో పెరుగుతున్న వరద తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం

రిపోర్టర్: గోపి స్థలం: భామిని

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వంశధార నదిలో వరద పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్, బత్తిలి ఎస్సై రవీంద్ర హెచ్చరించారు. భామిని మండలం కాట్రగాడ (బి) గ్రామంలో నదీ తీర ప్రాంతాన్ని పరిశీలించిన వారు.. ప్రజలు నదిలో స్నానాలకు వెళ్లవద్దని సూచించారు. మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు సమాచారం అందించాలని కోరారు.