పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టన్న సీపీఐ నేత
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి గుణపాఠమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణ కుమార్ ఖమ్మంలో పేర్కొన్నారు. దానం నాగేందర్ అనర్హతపై వెలువడిన ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి బలాన్నిచ్చిందని ఆయన అన్నారు. పార్టీ మారే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వత నిషేధం విధించేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.