నిండుగొండ మస్జిద్ లో భక్తిశ్రద్ధలతో ఘనంగా గ్యార్వి షరీఫ్ వేడుకలు
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
రోలుగుంట మండలం నిండుగొండ గ్రామంలోని మస్జిద్ ప్రాంగణంలో ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో గ్యార్వి షరీఫ్ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక సభలో ప్రత్యేక ప్రసంగం చేసిన మౌలానా అబ్దుల్ వహిద్ రాజా ఇస్లామిక్ ధర్మ సూత్రాలను ఆచరించాలని భక్తులకు హితబోధ చేశారు. అనంతరం నిర్వహించిన సామూహిక ప్రార్థనల తర్వాత భక్తులందరికీ మహా అన్నదానం పంపిణీ చేశారు.