సౌదీలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు: వీసా గడువు ముగుస్తుండటంతో తీవ్ర ఆందోళన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్ర నిమిత్తం వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది యాత్రికులు విమానాల రాకపోకల్లో అకస్మాత్తుగా తలెత్తిన తీవ్ర అంతరాయం కారణంగా అక్కడే చిక్కుకుపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైట్లు రద్దు కావడంతో ఎయిర్పోర్టులు, హోటళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు వీసా గడువు ముగుస్తుండటంతో చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నామని యాత్రికులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించి తమను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.