నర్సీపట్నంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో పోలీసులు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ మరియు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు ఎస్డీపీవో ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా రెండు వందల ముప్పై ఇళ్లను సోదా చేసి, నాలుగు వందల నలభై మంది వివరాలు సేకరించారు. మాదకద్రవ్యాల నిరోధానికి, నేరాల నియంత్రణకు ఈ తనిఖీలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.