గ్లోబల్ చెస్ లీగ్‌లో అదరగొడుతున్న భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రణేష్
రిపోర్టర్: మహేష్
స్థలం: కర్ణాటక
బెంగళూరు వేదికగా జరుగుతున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ తరఫున ఆడుతున్న ఇరవై ఏళ్ల చెస్ ఆటగాడు ప్రణేష్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అనిష్ గిరి, లెవోన్ అరోనియన్ వంటి దిగ్గజాలపై విజయాలు సాధించి తన సత్తా చాటాడు. కనీస అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ప్రణేష్, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో దీటుగా పోరాడగలనని నిరూపించుకుంటూ చెస్ సర్కిల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.