పాలకొండలో ఇంటింటి ప్రచారంతో హోరెత్తించిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. డోలామడ, వాటపాగు స్థానాల్లో కూటమి టీడీపీ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, చంద్రబాబు పాలనలో అభివృద్ధి సాధ్యమని అభ్యర్థులు తెలిపారు. ఈ ప్రచారంలో స్థానిక కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.