త్వరలో సీఎస్‌ఈఈటీ అక్టోబర్ సెషన్ హాల్ టికెట్లు విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగనున్న కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అక్టోబర్ సెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. అక్టోబర్ 1, 3, 5 మరియు 6 తేదీల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనుండగా, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icsi.edu ద్వారా తమ ప్రత్యేక ఐడీ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐసీఎస్‌ఐ వెల్లడించింది.