ఢిల్లీలో కిడ్నాపర్ హల్చల్: బాలుడిని రక్షించి నిందితుడిని పట్టుకున్న పోలీసులు
రిపోర్టర్: మహేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ధర్మపాల్ అనే వ్యక్తి, ఆమె 11 ఏళ్ల తమ్ముడిని కిడ్నాప్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ బాలుడిని తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు 22 కిలోమీటర్ల పాటు వెంబడించి ఆజాద్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద బాలుడిని సురక్షితంగా రక్షించారు. పోలీసులకు చిక్కే సమయంలో నిందితుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కస్టడీలో ఉన్నాడు.