తీవ్ర వాయుగుండం హెచ్చరికతో అడ్డగూడూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సర్పంచ్
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
బంగాళాఖాతంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, అడ్డగూడూరు పట్టణ ప్రజలు, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక సర్పంచ్ పూజారి వనజ సైదులుగౌడ్ హెచ్చరించారు. ఈదురుగాలులతో కురిసే భీకర వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.