మలవిసర్జన తర్వాత తీవ్ర మంట సమస్య: డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కీలక వివరాలు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
మలవిసర్జన తర్వాత వచ్చే తీవ్రమైన మంట సమస్యను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. మలబద్ధకం, పైల్స్, ఫిషర్స్ లేదా స్పైసీ ఫుడ్స్ కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని ఆయన స్పష్టం చేశారు. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో ఈ అనారోగ్య సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు.