గురుదాస్‌పూర్‌లో కాంగ్రెస్ సర్పంచ్ తమ్ముడి కాల్చిచంపిన దుండగులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: పంజాబ్

పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పద్దా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ నవదీప్ సింగ్ తమ్ముడు సుఖ్‌రాజ్ సింగ్ అలియాస్ కాకాను దుండగులు కాల్చిచంపారు. గురుద్వారాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మారుతి స్విఫ్ట్ కారులో వచ్చిన అజ్ఞాత వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుఖ్‌రాజ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక విచారణలో భాగంగా పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.