మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యూవల్ ఫీజుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యూవల్ ఫీజు వివాదంపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన రెన్యూవల్ ఫీజును చెల్లించి లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని దుకాణ యజమానులను ఆదేశించింది. అయితే ప్రస్తుతం చెల్లించే ఫీజు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.