ద్ విమానాశ్రయంపై దాడి: మరో భారతీయ డు మృతితో 14కు మరణాలు

రిపోర్టర్: హరి స్థలం: రియాద్

రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మరో భారతీయుడు మృతి చెందడంతో మృతుల సంఖ్య పద్నాలుగుకు చేరిందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం వెల్లడించింది. అక్టోబర్ పదవ తేదీన జరిగిన ఈ దాడుల్ లో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించిన ఆ బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తగిన సాయం అందిస్తామని తెలిపింది.