ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం: నాన్ బెయిలబుల్ కేసులు నమోదు
రిపోర్టర్: శివ
స్థలం: తిరుపతి జిల్లా
ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో కొత్తగా వేసిన రహదారిని తవ్వేసిన వారిపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసే వ్యక్తుల పట్ల ఎంతమాత్రం సహించేది లేదని, రెవెన్యూ రికవరీ చట్టం కింద నష్టాన్ని రికవరీ చేయాలని స్పష్టం చేశారు.