రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో వివిధ రంగాలకు నీటి భద్రతే లక్ష్యంగా సమగ్ర నీటి ప్రణాళికను రూపొందించాలని, ప్రాజెక్టుల పురోగతిలో ఎక్కడా రాజీపడేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.