బట్లలో విద్యార్థుల హాజరు 95 శాతానికి పెంపునకు కార్యాచరణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును 95 శాతానికి పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్ర సరాసరి హాజరు 85.45% ఉండగా, శ్రీకాకుళం ప్రథమ స్థానంలో, కర్నూలు చివరి స్థానంలో నిలిచాయి. వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే తల్లిదండ్రులతో చర్చించే వ్యవస్థను తెచ్చారు. అలాగే శిథిలావస్థకు చేరిన 3,733 భవనాలను ఈ నెల 30లోపు కూల్చివేయాలని నిర్ణయించారు.