అమ్రపాలి గ్రూప్ కేసులో ఈడీ పంజా: భారీగా ఆస్తుల జప్తు

రిపోర్టర్: కిరణ్ స్థలం: లక్నో

అమ్రపాలి గ్రూప్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. దిల్లీలోని మహారాణి బాగ్ ప్రాంతంలో సుమారు యాభై నాలుగు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తిని జప్తు చేసినట్లు ఈడీ లక్నో జోనల్ ఆఫీస్ స్పష్టం చేసింది. ఇళ్ల కొనుగోలుదారుల సొమ్మును దారి మళ్లించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.