నల్లగొండలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు ఉచిత శిక్షణ
రిపోర్టర్: శివ
స్థలం: నల్లగొండ
నల్లగొండ జిల్లాలో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన 500 మందిని ఎంపిక చేసి ట్రైనింగ్ సెంటర్లో వసతి, భోజన సౌకర్యాలతో పాటు రాత పరీక్ష, శారీరక దారుఢ్య శిక్షణ ఇస్తామన్నారు. ఈ నెల 20న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.