తిరుపతిలో డీజీపీల జాతీయ సదస్సు: హాజరుకానున్న ప్రధాని మోదీ
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుపతి
డిసెంబరు నాలుగు నుంచి ఆరు వరకు తిరుపతిలో జాతీయ స్థాయి డీజీపీలు, ఐజీపీల సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ సీఎస్ జి. సాయి ప్రసాద్ తెలిపారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యున్నత స్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.