నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి
ఐక్యరాజ్యసమితి నవంబర్ 27ను అంతర్జాతీయ బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించడం చారిత్రాత్మకం. ఈ నిర్ణయాన్ని తిరుపతి ప్రగతి సంస్థ స్వాగతించింది. కాయంపేట గ్రామస్తులతో కలిసి సంస్థ సిబ్బంది ఈ విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్' సంస్థ చేసిన సుదీర్ఘ కృషికి ఇది అంతర్జాతీయ గుర్తింపు. సుమారు 67 దేశాల మద్దతుతో సియెర్రా లియోన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 4న అధికారికంగా ఆమోదించింది.