బాల్య వివాహాల నిర్మూలనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: కె.వి. రమణ

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి

తిరుపతి తుడా కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రగతి సంస్థ డైరెక్టర్ కె.వి. రమణ పాల్గొన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి, తల్లిదండ్రులకు, అధికారులకు సమాచారం అందించడం ద్వారా అనేక వివాహాలను ఆపవచ్చని రమణ తెలిపారు. ఈ ఉద్యమంలో సహకరించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మరియు విద్యాశాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.