గుడిపాడులో భక్తిశ్రద్ధలతో ముగిసిన గణేష్ లడ్డు వేలం పాట

రిపోర్టర్: nivas స్థలం: ఏఎస్‌పేట

అనుమసముద్రంపేట మండలంలోని గుడిపాడు గ్రామంలో ఐదు రోజులపాటు పూజలందుకున్న స్వామివారి లడ్డు వేలంపాటలో ఒక లక్ష 65 వేల రూపాయలకు కె. సురేష్ అను వ్యక్తి కైవసం చేసుకోవడం జరిగింది. అనంతరం బాణాసంచా వెలుగుల మధ్య ఆ లడ్డును వారి దంపతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.