ఓల్డ్ హఫీజ్‌పేట్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం.. పోటెత్తిన భక్తజనం

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

ఓల్డ్ హఫీజ్పేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ వినాయక ఉత్సవాల్లో కాంగ్రెస్ నేత బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మియాపూర్ సీఐ జయరాం పాల్గొని పూజల అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. స్థానిక భక్తులు భారీగా తరలివచ్చి ప్రసాదం స్వీకరించగా, గౌతమ్ గౌడ్ కాలనీవాసులకు, యువజన సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.