సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర నిప్పులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కోట్లాది మంది పేర్లను తొలగించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవార వదిలిపెట్టే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో ప్రజల ఎదుట జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈసీ అక్రమాలపై దేశవ్యాప్తంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.