దారకొండలో వరద తాకిడి ప్రాంతాలను పరిశీలించిన గొర్లె వీర వెంకట్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం, డి.అగ్రహారం బ్రిడ్జిలను జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ శనివారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వైనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా తగిన సాయం అందిస్తామని, ఈ సమస్యను సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.