మహిళలను వేధిస్తే మరణ శాసనంపై సంతకం చేసినట్లేనని సీఎం యోగి హెచ్చరిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: లఖ్నవూ
ఉత్తరప్రదేశ్లో మహిళల భద్రతపై సీఎం యోగి ఆదిత్యనాథ్ లఖ్నవూలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూపీ వీధుల్లో మహిళలను వేధించే సాహసం ఎవరూ చేయరని, అలా చేస్తే తమ మరణ శాసనంపై తామే సంతకం చేసుకున్నట్లు అవుతుందని స్పష్టం చేశారు. గతంలో మాఫియా రాజ్యం ఉండేదని, నేడు రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగై అల్లర్లు పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పారు.