'సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రకటించాలి': సీపీఐ నేత మువ్వా వెంకటేశ్వరరావు డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు (లడ్డా) మాట్లాడుతూ, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, కమ్యూనిస్టుల త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు అందించాలని ఆయన కోరారు.