సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కొయ్యూరు పోలీసులు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

కొయ్యూరు: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు పోలీసులు సూచించారు. OTP, UPI PIN, ATM PIN, CVV, పాస్వర్డ్లను ఎవరికీ చెప్పకూడదని, అనుమానాస్పద లింకులు, APK ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని తెలిపారు. బ్యాంకు అధికారులు ఎప్పుడూ OTP, UPI PIN అడగరని పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.