అమెరికా మధ్యంతర ఎన్నికలపై డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక

రిపోర్టర్: సురేష్ స్థలం: Washington

అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్ లో డెమోక్రాట్లు విజయం సాధిస్తే తమ ప్రభుత్వ పాలనలో సాధించిన పురోగతి అంతా నాశనమవుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సీన్ హ్యానిటీతో మాట్లాడుతూ... రిపబ్లికన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వలసల నియంత్రణ, ఉద్యోగాల సృష్టి, వాణిజ్యలోటు తగ్గింపు వంటి అంశాలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను ట్రంప్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.