శబరిమల భక్తులకు తీపి కబురు: ప్రత్యేక బస్సులను ప్రకటించిన ఆర్టీసీ అధికారులు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ యాత్రను సురక్షితంగా మార్చేందుకు పలు రాయితీలు ప్రకటించామని తెలిపారు. కేరళ ప్రభుత్వం బస్సులకు సరిహద్దు పన్ను మినహాయింపునిచ్చిందని, భక్తులు హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ వర్గాలు పేర్కొన్నాయి.