బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వెంటనే అప్పీలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కేలా చూస్తామని, రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షలో వెల్లడించారు.