ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర

రిపోర్టర్: సురేష్ స్థలం: గుంటూరు

ఏపీ టైటానియం అండ్‌ రేర్‌ఎర్త్‌ పాలసీ ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, 65 వేల మందికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళగిరిలో గనుల శాఖ కొత్త కార్యాలయాలను ప్రారంభించిన ఆయన, అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు 18 వేల ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గనుల శాఖ రాబడి 32 శాతం పెరిగిందని ఆయన వెల్లడించారు.