ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో సినిమా చూస్తానన్న హీరో నాని

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న విడుదల కానున్న నేపథ్యంలో, తెలంగాణలో సెప్టెంబర్ 23నే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సాధారణ ప్రేక్షకులు, అభిమానుల మధ్య కూర్చొని సినిమాను వీక్షించాలని ఉందని హీరో నాని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.