దేవాలయ భూముల కబ్జాపై సోమిరెడ్డిపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: మహేష్
స్థలం: SPSR Nellore
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో పట్టాభిరామస్వామి దేవాలయానికి చెందిన భూమి అన్యాక్రాంతమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. సర్వే నెంబర్ 118-2 లో ఉన్న 25 సెంట్ల దేవాలయ భూమిని కబ్జా చేసి తవ్వకాలు జరుపుతున్నట్లు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భూముల ఆక్రమణలపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, దేవాలయ ఆస్తుల పరిరక్షణకు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.