స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన

రిపోర్టర్: అశోక్ స్థలం: వైఎస్ఆర్ కడప

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామ సభల ద్వారా ప్రజలకు పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు కడప పోలీసులు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఓటర్లకు ఎన్నికల నియమావళి, భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.