పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు ఆటంకాలు సృష్టించిన వైనం

రిపోర్టర్: సునీల్ స్థలం: పులివెందుల

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు చివరి నిమిషంలో ఆటంకాలు సృష్టించారని వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా అనుమతి ఇచ్చి ఆ తర్వాత కలెక్టర్ కొత్త నిబంధనలు తెచ్చారని పార్టీ నేతలు మండిపడ్డారు. ఇంధన కొరత కారణంగా పైలట్ అత్యవసరంగా హెలికాప్టర్ను ల్యాండ్ చేయాల్సి వచ్చిందని, ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వారు స్పష్టం చేశారు.