శ్రీకాకుళం జిల్లాలో విషాదం: రైలులో ప్రయాణిస్తున్న అస్సాం యువతి మృతి

రిపోర్టర్: సునీల్ స్థలం: Srikakulam

రైలులో ప్రయాణిస్తూ భయాందోళనకు గురైన ఇరవయ్యేళ్ల అస్సాం యువతి హిమాశ్రీ బోరో మృతదేహం శ్రీకాకుళం జిల్లాలో రైలు పట్టాల సమీపంలో లభించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రయాణ సమయంలో తన చుట్టూ మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు ఉన్నారని, తనకు రక్షణ లేదని ఆమె బంధువులకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా డిమాండ్ చేశారు.