కేసీఆర్ కుటుంబ ఆస్తులు నిజాం ఆస్తుల కంటే ఎక్కువగా ఉన్నాయి
రిపోర్టర్: వెంకట్
స్థలం: రంగారెడ్డి జిల్లా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తులు నిజాం ఆస్తుల కంటే ఎక్కువగా ఉన్నాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ లో తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి భూముల పరిశీలనలో భాగంగా మాట్లాడిన ఆయన, కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ల వద్ద పదేళ్ల కిందట ఎలాంటి ఆస్తులు లేవని, ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.