రాజాపేటలో సీపీఐ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సత్యం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుర్ల లింగం తండ్రి చంద్రపాల్ మృతి చెందడంతో సోమవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వారి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.