అమెరికాలోని బోస్టన్లో ఘనంగా నందమూరి అందగాడు సంగీత కార్యక్రమం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Boston

అమెరికాలోని బోస్టన్లో తానా న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో నందమూరి అందగాడు సంగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తీవ్ర వర్షాలు కురిసినప్పటికీ తెలుగు పాటల అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఎన్టీఆర్ చిత్రాల గీతాలను ఆస్వాదించారు. మధురవాణి మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో గాయకులు ఆలపించిన పాత తరపు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని కళాకారులను అభినందించారు.