తెలంగాణలో హ్యుందాయ్ భారీ పెట్టుబడి: జహీరాబాద్లో ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డితో హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధి బృందం సమావేశమైందని సీఎం కార్యాలయం వెల్లడించింది. జహీరాబాద్ నిమ్జ్లో రూ. 8,528 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఆర్ అండ్ డీ కేంద్రం పనులను వేగవంతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4,276 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.