'గిరిజన ఆత్మబంధువు కేసీఆర్': ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా గ్రామస్థుల పాలాభిషేకం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్థులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, 10శాతం రిజర్వేషన్లు కల్పించిన కేసీఆర్ గిరిజన ఆత్మబంధువు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, నాయకులు తిరుపతి, నర్సింగ్, జ్ఞానేశ్వర్, తులసీరామ్, రాంకిషన్, సంతోష్ తదితరులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు.