అకారణ మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగానే ప్రెస్లీ గెర్బర్ దహన సంస్కారాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమెరికా
అమెరికా సూపర్ మోడల్ సిండి క్రాఫోర్డ్ కుమారుడు ప్రెస్లీ గెర్బర్ తన ఇరవై ఏడేళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించిన కొన్ని రోజులకే ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. మృతికి సంబంధించిన అధికారిక కారణం ఇంకా వెల్లడికాకపోవడంతో పాటు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో అంత్యక్రియలు ఇంత త్వరగా ఎందుకు నిర్వహించారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నట్లు విదేశీ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంపై ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.