ఐఐటీ దిల్లీలో సెమీకండక్టర్స్ మరియు ఏఐ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
ఐఐటీ దిల్లీ నిరంతర విద్యా కార్యక్రమం ఆధ్వర్యంలో సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో రెండో బ్యాచ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆరు నెలల పాటు ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ కోర్సులో సెమీకండక్టర్ పరికరాలు, ఏఐ, హెచ్‌పీసీతో పాటు వాణిజ్యీకరణ, ఐపీ వ్యూహంపై శిక్షణ ఇస్తారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి 2026 సెప్టెంబర్ 30 చివరి తేదీ కాగా, తరగతులు 2027 జనవరి 9 నుంచి ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగుతాయి.